తొలి సరి నన్ను తాకిన నీ చూపులు .. చేతి లో చేయి వేసి చెప్పుకున్న బాసలు ...
తొలి వలపు లో తరగని ఊసులు .. గుప్పెడు గుండెల గంపెడు గుస గుసలు ....
ఇరువురి ఎద సవ్వడి ఒకటిగా మారిన మేళ తాళాలు .. పండితుల పవిత్రమయిన వేద మంత్రాలు ..
సదా నువ్వు నాకే అని కట్టిన పెళ్లి సూత్రాలు .. దివి దేవతలు దీవించిన కోటి ఆశీర్వచనాలు .. ఆత్మీయుల ఆనందపు అక్షంతలు ..
పంచ భూతాలు సాక్షి గా, అష్ట దిక్పాలకులు వినపడే లా, చాటిన పెళ్లి ప్రతిజ్ఞలు ...
"నాలో సగం అయినా నువ్వు , నీలో సగం అయినా నేను అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఒకటే ప్రియతమా ..!!
ఒక ఆత్మ గా పయనం అయినా ఆ తరుణం ..
ఎన్ని సార్లు తలుచుకున్న తీయగా వుండే మన పరిణయం ...