"చంద్రమ్మ"
"బోడి పర్తి" బంగారు బిడ్డ
"రాయల" వారి ఇంట అడుగు పెట్టిన ఆడ బిడ్డ
రేణుక ఎల్లమ్మ దీవెన తో
"హనుమంతుని" చెంతన
కొండంత అండగా నిలిచేన చంద్రమ్మ ...
"వెంకులయ్యా"ను కని కంటి రెప్ప లాగా
కడుపులో పెట్టుకున్న మా అమ్మ
పెద్ద కొడుకు పెద్ద చదువు చదివి పేరు తెచ్చేనే ఓ అమ్మ ..
చక్రం తిప్పే "సుదర్శుడుని" కని
పెద్ద వ్యాపారవేత్త చేసిన మా అమ్మ ...
ఆదర్శ తమ్ముడు-అన్నయ్య అయినాడు ఓ అమ్మ
నీ బిడ్డ "శంకరమ్మ" నీ వల్లే
పెంచితివే ఓ అమ్మ , గూడెం లో నీ వల్లే పేరు తెచ్చి
మచ్చ లేకుండా పెరిగింది ఓ అమ్మ ...
ముద్దు "చంద్రయ్య" ను మురిపెంముగా పెంచితివే
జనం మనం అని అందరికి సేవ చేసెను నీ చిన్న బిడ్డ ..
"మన"వాళ్ళు , మనవలు , మనవరాలు, ముని-మనవలు, ముని-మనవరాలు,
అందరికి నువ్వు ప్రియం ..
నీ చల్లని చేతి స్పర్శ్ తో పెరిగిన మేము అంత నీ చెట్టు కింద బిడ్డలము ..
వనం వల్లే నీ "బలగం" ..
కుటుంబం కి దిద్దే "తిలకం"...!!!
ఒక తరం ముగిసింది , నిండు కుండా నిండుకుంది ...
అమ్మల కన్నా అమ్మ నీకు సెలవు ..
ఎక్కడ వున్నా నీ చల్లని వెన్నెల్లా మాకు ఉంటుంది "చంద్రమ్మ" ...!!!
Monday, March 18, 2024
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment